హైదరాబాద్, వెలుగు: యాసంగికి సంబంధించి రాష్ట్ర సివిల్ సప్లైస్శాఖ ఇప్పటివరకు 10.2 లక్షల టన్నుల వడ్లు సేకరించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ.500.20 కోట్లను జమ చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నారు.
వీటిలో పీఏసీఎస్ కింద 4,350, ఐకేపీ కింద, 3,563, ఇతర సంస్థల కింద 662 కేంద్రాలు నడుస్తున్నాయి. 4.50 లక్షల టన్నుల సన్న రకం, 5.50 లక్షల టన్నుల దొడ్డు రకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా అధికారులు ఎప్పటికప్పుడు నేరుగా మిల్లులకు తరలిస్తున్నారు.
